మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Showing posts with label బాలవ్యాకరణం. Show all posts
Showing posts with label బాలవ్యాకరణం. Show all posts

65 బాల వ్యాకరణం | సమాస పరిచ్ఛేదము | మూడు నాము మొ| Bala Vyakaranam | Samasa Parichedam








                      

17.సమానాధికరణంబగు నుత్తరపదంబు పరంబగునపుడు మూఁడు శబ్దము డుఙ్వర్ణంబునకు
లోపంబును మీఁది హల్లునకు ద్విత్వంబునగు.
మూఁడు జగములు - ముజ్జగములు, మూఁడు లోకములు - ముల్లోకములు.
18.ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగా నగు, మిశ్రంబునకుఁ గాదు.
ముచ్చిచ్చు - ముక్కారు - ముప్పాతిక - ముత్త్రోవ - మువ్విధములు.

                    https://andhrabharati.com/bhAshha/bAlavyAkaraNamu/samAsa.html


64 బాల వ్యాకరణం |సమాస పరిచ్ఛేదము| త్రికముతో సమాసం| Samasa Parichedam | Trikamuto Samasam





                     


13.ద్విరుక్తం బగు హల్లు పరంబగునపు డాచ్ఛికం బగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.
14.త్రికంబుమీఁది యసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.
అక్కన్య - ఆ కన్య, ఇక్కాలము - ఈ కాలము, ఎల్లోకము - ఏ లోకము, అయ్యశ్వము - ఆ యశ్వము.

బహుళకముచే నూష్మరేఫంబు లగు ద్విత్వంబు గలుగదు.
ఆ రూపము - ఏ శబ్దము - ఏ షండము - ఆ సుకృతి - ఆ హయము.
15.కృత హ్రస్వంబగు త్రికంబు మీఁది చోటు శబ్దంబు నోత్వంబున కత్వ హ్రస్వంబులు విభాషనగు.
అచ్చోటు - అచ్చటు - అచ్చొటు, ఇచ్చోటు - ఇచ్చటు - ఇచ్చొటు, ఎచ్చోటు - ఎచ్చటు - ఎచ్చొటు.

వీని ద్విత్వంబునకు వక్ష్యమాణవిధిచేఁ బాక్షికంబుగ లోపంబగు.
అచటు - అచొటు - ఇచటు - ఇచొటు - ఎచటు - ఎచొటు - ముచ్చొటులు - ముచ్చటులు - ముచ్చొటులు అను రూపంబగు ప్రయోగంబులం గానంబడియెడి.
16.ఉత్తరపదం బగు చోట శబ్దముటాక్షరమునకు లోపంబు విభాష నగు.
చోటు శబ్దం బౌపవిభక్తికంబు గావున దాని యంతిమాక్షరంబు సప్తమ్యాదేశమయిన యకారంబుతోడం బాక్షికంబుగ లోపించునని యర్థము.
అచ్చోనున్నాఁడు - అచ్చోట నున్నాఁడు, ఒకచో నుండె - ఒకచోట నుండె.


63 బాలవ్యాకరణం|సమాస పరిచ్ఛేదము|కర్మధారయలో అనుప్రయుక్తాలు| Samasa Parichedam | Anuprayuktalu







                  


8.సర్వశబ్దంబులు సంబంధమునందుం దచ్ఛబ్దంబుతోడ సమసించు.
నావాఁడు - నాయది - ఇంటివాఁడు - ఇంటిది - రామునివాఁడు - రామునిది.
9.ధాతుజ విశేషణంబులకు విభక్తి వివక్షించునపుడు తచ్ఛబ్దం బనుప్రయుక్తంబగు.
వచ్చినవాఁడు - వచ్చినది - రానివాఁడు - రానియది.
10.ఎల్ల యెడల ధాతుజ విశేషణంబుల కట్టి యను పదంబు విభాష ననుప్రయుక్తం బగు.
వచ్చినట్టి రాముఁడు - వచ్చిన రాముఁడు - వచ్చునట్టి వాఁడు - వచ్చువాఁడు.
11.యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాష నగు.
నీదు కరుణ - నీ కరుణ, నాదు నేరిమి - నా నేరిమి, తనదు రూపు - తనరూపు.
12.గుణవచనంబు లగు నల్లాదులకుం గర్మధారయంబునందు నిగాగంబు బహుళంబుగా నగు.
నల్లని గుఱ్ఱము - నల్ల గుఱ్ఱము.

నల్ల - తెల్ల - పచ్చ - యెఱ్ఱ - చామ - తియ్య - కమ్మ - పుల్ల - విన్న - తిన్న - అల్ల ఇత్యాదులు నల్లాదులు.

62 బాలవ్యాకరణం|సమాస పరిచ్ఛేదము|ఆచ్ఛిక సమాసాల్లో | Balavyakaranam| Samasaparichedam | Achika samasalu

          




                   


4.ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాఁబడు.
5.కర్మధారయంబు త్రిక స్త్రీ సమముగంత ధాతుజ విశేషణపూర్వపదం బయి యుండు.
ఆ చందము - ఈ చందము - ఏ బృందము - వాఁడిమాట - పోఁడిపాట - బెడిదపుటడిదము - మడిసెడుదడములు.

ఈ నియమముచేఁ బల్లిదుఁడు మల్లుఁడు - కావాలుఁడు వారణుఁడు ఇత్యాదుల సమాసంబు లేదు.
6.స్త్రీ సమఘటితంబ యొకానొకండు బహువ్రీహి చూపట్టెడు.
ముక్కంటి - వేగంటి - చలివెలుఁగు - వేవెలుఁగు - మోటబరి ఇత్యాదులు వ్యవహార సిద్ధంబులు గ్రాహ్యంబులు.
7.ఆచ్ఛికశబ్దంబుతోడ స్త్రీ సమంబు ప్రాయికంబుగా ద్వంద్వం బగు.
అన్నదమ్ములు - తల్లిదండ్రులు - ఊరుపల్లెలు - ఆలుమగలు. మగఁడును బిడ్డలును - పల్లమును గళ్ళెమును ఇత్యాదులు సమసింపవని యీ నియమంబున నెఱుంగునది.

61 బాలవ్యాకరణం | సమాస పరిచ్ఛేదము | సమాసాలు | Balavyakaranamu | Samasa Parichedamu | Samasalu

  






                   


2.సాంస్కృతికాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు.
సాంస్కృతికంబని యాచ్ఛికంబని మిశ్రంబని సమాసంబు త్రివిధంబు.
అందు సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు.

కేవల సంస్కృత శబ్దంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు.
రాజాజ్ఞ - తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు.

సంస్కృత సమంబుల సమాసంబు సాధ్యంబు నాఁబడు.
రాజునాజ్ఞ - తటాకంబు నుదకము - లక్ష్మీవల్లభుఁడు.

తక్కిన తెనుఁగుల సమాసం బాచ్ఛికం బనంబడు.
ఱేని యానతి - చెఱువు నీరు - సిరి చెలువుఁడు.

ఉభయంబు గూడినది మిశ్రమంబనంబడు.
రాజు ముదల - చెరువునుదకము - సిరివల్లభుఁడు. 

3.తత్పురుషాదులకు లక్షణంబు ప్రాయికంబుగ సంస్కృతోక్తంబ యగు.
తత్పురుష బాహువ్రీహి ద్వంద్వంబునని సమాసంబులెల్లం ద్రివిధంబులయి యుండు.
అవి ప్రాయికంబుగా నుత్తరాన్యోభయపదార్థ ప్రధానంబు లయియుండు. అందుఁ దత్పురుషంబు వ్యధికరణంబని సమానాధికరణంబని ద్వివిధంబు.

ద్వితీయాదులకు మీఁది పదఁబుతోడ సమాసంబు వ్యధికరణంబు నాఁబడు.
నెలతాల్పు - నెల తక్కువవాఁడు - దేవరమేలు - దొంగభయము - రాముని బాణము - మాటనేర్పరి.

విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబు నాఁబడు.
ఇదియె కర్మధారయంబు నాఁబడు.
సరసపు వచనము - తెల్ల గుఱ్ఱము - మంచిరాజు.

ఇది సంఖ్యాపూర్వంబు ద్విగువునాఁబడు.
ముజ్జగములు - ముల్లోకములు.

బాహువ్రీహి
ముక్కంటి - చలివెలుఁగు.

ద్వంద్వము
తల్లిదండ్రులు - అన్నదమ్ములు.

ప్రాయికంబుగా ననుటచే సంస్కృత లక్షణంబుఁ దొడరని సమాసంబుం గలదని సూచింపంబడియె. దానంజేసి చిగురుఁగేలు - జుంటిమోవి ఇత్యాదులయిన యుపమాన పూర్వపద కర్మధారయంబులు గ్రాహ్యంబులు.

ముఖపద్మము - చరణకమలములు.
ఇట్టి యుపమానోత్తర పదంబులు గలవుగాని విపరీతంబులు సిద్ధంబులు లేవని యెఱుంగునది.

సిద్ధంబు సర్వంబు గ్రాహ్యంబు.
రాజపురుషుఁడు - నీలోత్పలము - పీతాంబరుఁడు - రామలక్ష్మణులు.

కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు.
దానంజేసి యనేకమాఱు లల్పదండిత్యాదులు దుష్టములని తెలియునది.





60 బాల వ్యాకరణం |సమాస పరిచ్ఛేదము |సమాస లక్షణము | Balavyakaranamu |Samasa...








                       

1.సమర్థంబులగు పదంబు లేకపదం బగుట సమాసంబు.
ప్రథగ్భూతంబులగు నర్థంబుల కేకార్థీభావంబు సమర్థ్యంబు.
పృథక్ప్రసిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము.

59 బాలవ్యాకరణం | సమాస పరిచ్ఛేదము| పరిచయము| Bala vyakaranamu| Samasa Parichedam | Parichayam









                     

58 బాల వ్యాకరణము । కారక పరిచ్ఛేదం । యుష్మత్ – అస్మత్ శబ్దాల్లో | Karakaparichedam | Yushmad Asmad Shabdallo











                            

33. ప్రథమాంతంబు లగు యుష్మ దస్మ ద్విశేషణంబుల కేకత్వంబున

వు ను లు ను బహుత్వంబున రు ము లు నంతాగమంబులు ప్రాయికంబుగ నగు.

34. ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబున కత్వం బగు.

నీవు ధన్యుఁడవు - నేను ధన్యుఁడను - మీరు ధన్యులరు - మేము ధన్యులము. ఇకారంబు మీఁది కు-ను-వు క్రియా విభక్తుల యుత్వంబున కిత్వంబగు నను సూత్రముచేత వు ను ల కిత్వంబగు. నీవు సుకృతివి - నేను సుకృతిని - ఆర్తి హరుఁడ వౌ నినుఁ గొల్తు నంబుజాక్ష గర్వ గర్విష్ఠుండను నన్ను - మీరలు పెద్దలు - ఇత్యాదులు ప్రాయిక గ్రహణముచే రక్షితంబులయ్యె.

35. అది శబ్దంబునకు వు ను లు పరంబు లగునపుడును సంబోధనంబు నందును దాన యను నాదేశం బగు.

నీవు చిన్నదానవు - నేను జిన్నదాన - ఓ చిన్నదాన.

36. అన్య యుష్మ దస్మ త్కార్యంబులం దుత్తరోత్తరంబు బలీయంబు.

వారును మీరును ధన్యులరు - మీరును మేమును ధన్యులము.

37. ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వపదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపం జను.

పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపదగును. ఏని ప్రభృతి శబ్దములు కొన్ని నియమ సాపేక్షంబు లయియుండు. గాలి చల్లగా వీచెను - వీచెను జల్లగా గాలి - చల్లగా గాలి వీచెను - వీచెను గాలి చల్లగా - గాలి వీచెను చల్లగా - చల్లగా వీచెను గాలి.


57 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం అనుప్రయుక్తాలు Balavyakaranamu Karaka parichedam Anuprayuktalu





       

                       



29. భవత్యర్థకంబు సన్నిహిత విశేషణంబునకును, దాని ముందు విశేషణంబుల కయి పదంబును బహుళంబుగా ననుప్రయుక్తం బగు.

56 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం అన్యవిభక్తి ప్రథమ Karaka Parichedam Anya vibhaktulu


             


                     


24. జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు.

వాఁడు పూవులు దెచ్చె - వాఁడు పూవులను దెచ్చె. ఆకె సొమ్ములు దాల్చె - ఆకె సొమ్ములను దాల్చె. వాఁడిల్లు వెడలె - వాడింటిని వెడలె. బహుళకముచేఁ దృతీయా సప్తములకు విధించిన ద్వితీయకుం బ్రథమ రాదు.

55 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం అన్యవిభక్తులు–ద్వితీయా సప్తములు | Balavyakaranamu | karaka parichedam | Anya Vibhaktulu





                       


21. ఒకానొకచో నొక విభక్తికి మఱియొక విభక్తియు నగు.

మైత్రుండు గృహమున వెడలెను - గృహమునుండి యని యర్థము. వాఁడు వాహనమును దిగెను - వాహనమునుండి యని యర్థము. వారు సుఖమున్నారు - సుఖముతో నని యర్థము. ఇత్యాదులెఱుంగునది.

22. జడంబు తృతీయా సప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు.

రాముఁడు వాలినొక్క కోలంగూలనేసె - కోలతో నని యర్థము. లంకం గలకలంబు పుట్టె - లంకయందని యర్థము. బాహుళకంబుచే నిక్కార్యం బుదంతంబునకు బహుత్వమందెయగు. అర్జునుండు శత్రుసేనలను బాణంబులను రూపుమాపె - బాణములచే నని యర్థము. మీనంబు జలంబులనుండు - జలంబులందని యర్థము. 23. ఉదంత జడంబు తృతీయకు నవర్ణకం బగు.

రాముఁ డొక్క బాణంబున వాలింగూలనేసె - బాణముచే నని యర్థము.


54 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం - విశేషణాలు అన్యవచనాల్లో - Balavyakaranamu Karaka parichedamu Visesanalu Anyavachanallo





                     

ఈ కింది సూత్రాలపై పాఠం 

19. విశేష్యంబునకుంబోలె విశేషంబునకు లింగవిభక్తి వచనంబు లగు.

నందతనయుండు కృష్ణుండు నాకు దిక్కు - దేవకీపుత్రు హరిని నుతింతు నెపుడు - శుభవిధాయుల రామకృష్ణుల భజింతు - భువనవంద్యను రుక్మిణిఁ బ్రస్తుతింతు. 

53 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం షష్ఠి సప్తమి విభక్తులు Balavyakaranamu Karaka parichedamu Shshti Saptami Vibhaktulu





                    

ఈ క్రింది సూత్రాలకు పాఠం 

             15. శేషషష్ఠికి యొక్కయు నగు.

ఇచట శేషంబనఁగా సంబంధంబు. రాముని యొక్క గుణములు - నా యొక్క మిత్రుఁడు - వానియొక్క తమ్ముఁడు. కువర్ణకంబును గొన్ని యెడల సంబంధంబునం దగు. నాకుం దమ్ముఁడు - మీకు నెచ్చెలి.

16. నిర్ధారణషష్ఠికి లోపల వర్ణకంబగు.

జాతి గుణ క్రియా సంజ్ఞలచేత సముదాయంబునుండి యేకదేశంబునకుం బృథక్కరణంబు నిర్థారణం బనంబడు. ఎద్దానివలన నిర్థారణంబగు నచ్చటి షష్ఠికి లోపల వర్ణకం బగునని యర్థము. మనుష్యులలోపల క్షత్రియుండు శూరుండు - గోవుల లోపలఁ గపిల బహుక్షీర - అధ్వగుల లోపలం బాఱువాఁడు శీఘ్రగామి - ఛాత్రులలోపలఁ మైత్రుండు సమర్థుండు. ఇచట సప్తమియు గలదు. మనుష్యులయందు క్షత్రియుండు శూరుండు. ఇత్యాదులెఱుంగునది.

17. అధికరణంబునకు సప్తమి యగు.

అధికరణంబు నానాధారంబు. ఔపశ్లేషికంబు వైషయికం బభివ్యాపకంబని యాధారంబు త్రివిధంబు. ఘటమందు జలమున్నది - మోక్షమం దిచ్ఛ గలదు - అన్నిటియం దీశ్వరుండు గలడు.

18. ఉకారాంత జడంబునకు నవర్ణకం బగు.

ఘటంబున జలంబున్నది - దేవదత్తునకు మోక్షమున నిచ్ఛ గలదు.


52 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం చతుర్థి పంచమి విభక్తులు Bala Vyakaranamu Karaka - Chaturthi - Panchami Vibhaktulu





  
                       

ఈ కింది సూత్రాలపై పాఠం 


8. సంప్రదానంబునకుం జతుర్థి యగు. 

51 బాల వ్యాకరణము | కారక పరిచ్ఛేదం|తృతీయా విభక్తి| Balavyakaranamu| Karaka Parichedam Triteeya Vibhakthi







                  

ఈ కింది సూత్రాలకు పాఠం.

  3. చేతవర్ణకంబు కర్త కగు.

ధాత్వర్థ వ్యాపారాశ్రయంబు కర్తనాఁబడు. దేవదత్తుని చేత వంటకము వండఁబడియె. వండఁబడియె ననఁగా వంట చేయఁబడియెనని యర్థము. చేయుటం కాశ్రయుఁడగుటం జేసి దేవదత్తుండు కర్తయయ్యె. 

50 బాల వ్యాకరణము కారక పరిచ్ఛేదం ద్వితీయా విభక్తి Balavyakaranamu- Karaka Parichedam - Dvitiya Vibhakti




                     


2.కర్మంబున ద్వితీయ యగు.
ధాత్వర్థఫలాశ్రయంబు కర్మము నాఁబడు.
దేవదత్తుఁడు వంటకమును వండెను. ఇట వండె ననుమాటకు వంట చేసెనని యర్థము.
వంట ఫలము - చేయుట వ్యాపారము. వంట యనంగ బాకము.
పాకమున కాశ్రయము కావుటంజేసి వంటకము కర్మం బయ్యెనని యెఱుంగునది.

49 బాల వ్యాకరణము కారక పరిచ్ఛేదం ప్రథమా విభక్తి Balavyakaranamu | Karaka Parichedam | Prathama Vibhakti




48 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం పరిచయం Karaka parichedam parichayam





                      

47 బాల వ్యాకరణం ఆచ్ఛిక పరిచ్ఛేదం ఔపవిభక్తికములు Balavyakaranam Achika Parichedam Aupa Vibhaktikalu

                         




                         

46 బాలవ్యాకరణం ఆచ్ఛిక పరిచ్ఛేదం సంఖ్యావాచకాలు Balavyakaranam Achika Parichedam Sankhya Vachakalu




                    

అనుసరించువారు