4. | ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాఁబడు. |
5. | కర్మధారయంబు త్రిక స్త్రీ సమముగంత ధాతుజ విశేషణపూర్వపదం బయి యుండు.ఆ చందము - ఈ చందము - ఏ బృందము - వాఁడిమాట - పోఁడిపాట - బెడిదపుటడిదము - మడిసెడుదడములు.
ఈ నియమముచేఁ బల్లిదుఁడు మల్లుఁడు - కావాలుఁడు వారణుఁడు ఇత్యాదుల సమాసంబు లేదు. |
|
6. | స్త్రీ సమఘటితంబ యొకానొకండు బహువ్రీహి చూపట్టెడు.ముక్కంటి - వేగంటి - చలివెలుఁగు - వేవెలుఁగు - మోటబరి ఇత్యాదులు వ్యవహార సిద్ధంబులు గ్రాహ్యంబులు. |
|
7. | ఆచ్ఛికశబ్దంబుతోడ స్త్రీ సమంబు ప్రాయికంబుగా ద్వంద్వం బగు.అన్నదమ్ములు - తల్లిదండ్రులు - ఊరుపల్లెలు - ఆలుమగలు. మగఁడును బిడ్డలును - పల్లమును గళ్ళెమును ఇత్యాదులు సమసింపవని యీ నియమంబున నెఱుంగునది. |
|
|
0 వ్యాఖ్యలు:
Post a Comment