మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

52 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం చతుర్థి పంచమి విభక్తులు Bala Vyakaranamu Karaka - Chaturthi - Panchami Vibhaktulu





  
                       

ఈ కింది సూత్రాలపై పాఠం 


8. సంప్రదానంబునకుం జతుర్థి యగు. 


త్యాగోద్దేశంబు సంప్రదానంబు నాఁబడు. జనకుండు రాముని కొఱకుఁ గన్యనిచ్చెను. కొన్నియెడల నుద్దేశ్యమాత్రంబున కగు. పురుషార్థంబు కొఱకు ప్రయత్నింపవలయు. చతుర్థికి మాఱుగా షష్ఠియె తఱచుగా బ్రయోగంబులం గానంబడియెడి. జనకుండు రామునకుం గన్యనిచ్చెను. పురుషార్థంబునకు యత్నింపవలయు. 


9. అపాయ భయ జుగుప్సా పరాజయ ప్రమాద గ్రహణ భవన త్రాణ విరామాంతర్థి వారణంబు లెద్దాననగు, దానికి వలన వర్ణంకం బగు. 


అపాయము - విశ్లేషము, భయము - వెఱపు, జుగుప్స - ఏవ, పరాజయము - దయ్యుట, ప్రమాదము - పరాకు, గ్రహణము కొనుట, ఎఱుంగుట - వినుట ఇత్యాది, భవనము - పుట్టుట, త్రాణము - కాచుట, విరామము - విరమించుట, అంతర్థి - మఁఱుగుట, వారణము - వారించుట. అపాయంబునకు - మైత్రుండు రాజ్యంబువలన భ్రష్టుండయ్యె. భయంబునకు - చోరునివలన భయపడియె. జుగుప్సకు - పాపంబు వలన నేవగించె. పరాజయమునకు - అధ్యయనము వలన డస్సె. ప్రమాదంబునకు - పాడివలనం బరాకు వడియె. గ్రహణంబునకు - మైత్రుని వలన ధనంబు గొనియె. భవనంబునకు - మనువు వలనం బ్రజలు పుట్టిరి. త్రాణంబునకు - చోరునివలనం గాచె. విరామంబునకు - భోగంబుల వలన విరమించె. అంతర్థికి - కృష్ణుండు తల్లి వలన దాఁగె. వారణంబునకు - శోకంబువలన వారించె. ఈ పంచమికి షష్ఠియుం గొండొకయెడల నగు. చోఱునకు వెఱచె. పాపంబున కేవగించె. అధ్యయనంబునకు డస్సె. పాడికిం బరాకువడియె. మనువునకు నిక్ష్వాకుండు పుట్టె - ఇత్యాదు లూహించునది. 


10. ఉండిపదం బొకానొకచో వలన వర్ణకంబున కనుప్రయుక్తంబగు. 


హిమగిరివలన నుండి గంగవొడమె - నాకంబువలన నుండి నారదుండు వచ్చె. 


11. ఉండిశబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాసప్తములు ప్రాయికంబుగ నగు. 


వనమునుండి వచ్చె - వనమందుండి వచ్చె. ఊరినుండి వచ్చె ఊరనుండి వచ్చె. వనమునుంచి, ధనమునుంచి యని యుంచి శబ్దాను ప్రయోగంబుతోఁ గొందఱు వ్యవహరించెదరు. గాని యది సాధుకవి ప్రయోగారూఢంబుగాదని యెఱుంగునది.

12. కంటెవర్ణకం బన్యార్థాది యోగజం బగు పంచమికగు. 


రామునికంటె నన్యుండు ధానుష్కుండు లేఁడు. లోభంబుకంటె నితరంబు దోషంబు లేదు. ఇచట షష్ఠియునగు. రామున కన్యుండు ధానుష్కుండు లేఁడు. అన్యము - ఇతరము - పూర్వము - పరము - ఉత్తరము ఇత్యాదు లన్యాదులు. 


13. కంటెవర్ణకంబు నిర్ధారణపంచమి కగు. 


ఎచ్చట నిర్ధార్యమాణంబు జాత్యాదులచే భేదంబు కలిగియుండు, నచటం బంచమియగు. ఆ పంచమికిం గంటె వర్ణకంబగునని యర్థము. జానపదులకంటె నాగరులు వివేకులు. మానహానికంటె మరణము మేలు. 


14. పట్టివర్ణకంబు హేతువులగు గుణక్రియల కగు. 


జ్ఞానముఁబట్టి ముక్తుఁడగు - నీవు వచ్చుటంబట్టి ధన్యుడనయితి. ఇచట వలన వర్ణకంబు నగు. జ్ఞానము వలన ముక్తుండగు.


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు