మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

47 బాల వ్యాకరణం ఆచ్ఛిక పరిచ్ఛేదం ఔపవిభక్తికములు Balavyakaranam Achika Parichedam Aupa Vibhaktikalu

                         




                         


 
ఈ క్రింది సుత్రాలపై పాఠము (సూత్రాలు :- ఆంధ్రభారతి వారి సౌజన్యంతో)

27.అపదాద్యంబయి యసంయుక్తంబయిన గకారంబునకు వకారంబు విభాష నగు.
పలుగురు - పలువులు, ఇరుగురు - ఇరువురు, వేగురు - వేవురు, తొగ - తొవ, పగలు - పవలు.
ఔప విభక్తిక ప్రకరణము
28.ఇ టి తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు.
విభక్తి నిమిత్తకంబులయి యాదేశాగమాత్మకంబులయిన ఇ - టి - తి అను వర్ణంబు లౌపవిభక్తికంబు లనంబడు.
29.ఇవి ద్వితీయాద్యేక వచనంబులు పరంబులగునపుడు నామంబులకుం గొన్నింటికిం బ్రాయికంబుగ నగు.
కాలు - కాలిని - కాలిచే, నాఁగలి - నాఁగటిని - నాఁగటిచే, నేయి - నేతిని - నేతిచే.
ద్వితీయైక వచనంబు పరంబగు నపు డౌపవిభక్తికంబులు రావని కొందఱు వక్కాణించిరి.
అయ్యది లక్ష్యలక్షణ విరుద్ధంబగుటంజేసి యనాదరణీయంబు.
30.ఊరు మొదలగువాని కిత్వం బగు.
ఊరు - ఊరిని, కాలు - కాలిని, మ్రాను - మ్రానిని, నోరు - నోరిని, చోటు - చోటుని.
31.టి వర్ణంబు గొన్నింటి యంతాక్షరంబున కాదేశంబును, గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున రెండును బ్రాయికంబుగ నగు.
ఆదేశము: త్రాడు - త్రాటిని, కాఁడు - కాటిని, నోరు - నోటిని, ఏఱు - ఏటిని.
ఆగమము: ఆన్ని - అన్నిటిని, ఎనిమిది - ఎనిమిదిటిని, వేయి - వేయిటిని.
ఉభయము: ఏమి - ఏటిని - ఏమిటిని, పగలు - పగటిని - పగలిటిని, మొదలు - మొదటిని - మొదలిటిని, రెండు - రెంటిని - రెండింటిని, మూఁడు - మూటిని - మూఁడిటిని, నూఱు - నూటిని - నూఱిటిని.
32.హ్రస్వముమీఁది టి వర్ణకంబు ముందు పూర్ణబిందువు బహుళముగానగు.
అన్నింటిని, ఎనిమిదింటిని, పగంటిని, పగలింటిని, రెండింటిని, మూఁడింటిని.
33.పదాద్యం బగు హ్రస్వంబుమీఁది టి వర్ణంబునకు ముందు పూర్ణబిందు వగు.
కన్ను - కంటిని, మిన్ను - మింటిని, ఇల్లు - ఇంటిని, పల్లు - పంటిని.
34.అఱ్ఱు మొదలగు శబ్దముల కంతాగమంబు తి వర్ణంబును రేఫంబున కొక్కటికి లోపంబు నగు.
అఱ్ఱు - అఱితిని. అఱ్ఱు - కఱ్ఱు - కొఱ్ఱు - గొఱ్ఱు - ముఱ్ఱు - వఱ్ఱు ఇవి యఱ్ఱు మొదలయినవి.
35.విభక్తి పరంబగునపుడు గోయి ప్రభృతుల తుదియక్షరంబు తి వర్ణకం బగు.
గోయి - గోతులు - గోతిని - గోతులను. గోయి - చేయి - దాయి - నూయి - నేయి - వాయి - రోయి ఇత్యాదులు.
36.టి తి వర్ణకంబులు పరంబులగునపు డుత్వంబున కిత్వం బగు.
రెంటిని - మూఁడిటికి - నాలుగిటికి - పగలిటికి - మొదలిటికి - పెక్కిటికి.
కొండొకచో నుత్వంబున కిత్వంబు చూపట్టదు - నెత్తుటికి.
37.టి వర్ణంబు పరంబగునపుడు క్రిందు మీఁదు ముందు పువర్ణంబుల కత్వం బగు.
క్రిందు - క్రిందటిని, మీఁదు - మీఁదటిని, ముందు - ముందటిని, మాపు - మాపటిని, అప్పుడు - అప్పటిని.
38.ఔపవిభక్తికముల తృతీయాసప్తముల కత్వం బాదేశంబు బహుళంబుగా నగు.
గోరను గీరెను, ఊరనున్నాడు, గొడ్డట నరెకెను, ఇంటలేఁడు, వఱుతఁ గలిసె, కఱతఁ దూటె. పక్షంబునందుఁ గోరిచేత నూరియం దిత్యాదులు.

1 వ్యాఖ్యలు:

DrKodiRama said...

Excellent knowledge sarma ni.

Post a Comment

అనుసరించువారు