| 17. | సమానాధికరణంబగు నుత్తరపదంబు పరంబగునపుడు మూఁడు శబ్దము డుఙ్వర్ణంబునకు
| |
| 18. | ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగా నగు, మిశ్రంబునకుఁ గాదు.
| |
https://andhrabharati.com/bhAshha/bAlavyAkaraNamu/samAsa.html
| 17. | సమానాధికరణంబగు నుత్తరపదంబు పరంబగునపుడు మూఁడు శబ్దము డుఙ్వర్ణంబునకు
| |
| 18. | ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగా నగు, మిశ్రంబునకుఁ గాదు.
| |
| 13. | ద్విరుక్తం బగు హల్లు పరంబగునపు డాచ్ఛికం బగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. | |
| 14. | త్రికంబుమీఁది యసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.
| |
| 15. | కృత హ్రస్వంబగు త్రికంబు మీఁది చోటు శబ్దంబు నోత్వంబున కత్వ హ్రస్వంబులు విభాషనగు.
| |
| 16. | ఉత్తరపదం బగు చోట శబ్దముటాక్షరమునకు లోపంబు విభాష నగు.
| |
| 8. | సర్వశబ్దంబులు సంబంధమునందుం దచ్ఛబ్దంబుతోడ సమసించు.
| |
| 9. | ధాతుజ విశేషణంబులకు విభక్తి వివక్షించునపుడు తచ్ఛబ్దం బనుప్రయుక్తంబగు.
| |
| 10. | ఎల్ల యెడల ధాతుజ విశేషణంబుల కట్టి యను పదంబు విభాష ననుప్రయుక్తం బగు.
| |
| 11. | యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాష నగు.
| |
| 12. | గుణవచనంబు లగు నల్లాదులకుం గర్మధారయంబునందు నిగాగంబు బహుళంబుగా నగు.
| |
| 4. | ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాఁబడు. | |
| 5. | కర్మధారయంబు త్రిక స్త్రీ సమముగంత ధాతుజ విశేషణపూర్వపదం బయి యుండు.
| |
| 6. | స్త్రీ సమఘటితంబ యొకానొకండు బహువ్రీహి చూపట్టెడు.
| |
| 7. | ఆచ్ఛికశబ్దంబుతోడ స్త్రీ సమంబు ప్రాయికంబుగా ద్వంద్వం బగు.
| |
| 2. | సాంస్కృతికాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు.
| ||||
33. ప్రథమాంతంబు లగు యుష్మ దస్మ ద్విశేషణంబుల కేకత్వంబున
వు ను లు ను బహుత్వంబున రు ము లు నంతాగమంబులు ప్రాయికంబుగ నగు.
34. ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబున కత్వం బగు.
నీవు ధన్యుఁడవు - నేను ధన్యుఁడను - మీరు ధన్యులరు - మేము ధన్యులము. ఇకారంబు మీఁది కు-ను-వు క్రియా విభక్తుల యుత్వంబున కిత్వంబగు నను సూత్రముచేత వు ను ల కిత్వంబగు. నీవు సుకృతివి - నేను సుకృతిని - ఆర్తి హరుఁడ వౌ నినుఁ గొల్తు నంబుజాక్ష గర్వ గర్విష్ఠుండను నన్ను - మీరలు పెద్దలు - ఇత్యాదులు ప్రాయిక గ్రహణముచే రక్షితంబులయ్యె.
35. అది శబ్దంబునకు వు ను లు పరంబు లగునపుడును సంబోధనంబు నందును దాన యను నాదేశం బగు.
నీవు చిన్నదానవు - నేను జిన్నదాన - ఓ చిన్నదాన.
36. అన్య యుష్మ దస్మ త్కార్యంబులం దుత్తరోత్తరంబు బలీయంబు.
వారును మీరును ధన్యులరు - మీరును మేమును ధన్యులము.
37. ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వపదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపం జను.
పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపదగును. ఏని ప్రభృతి శబ్దములు కొన్ని నియమ సాపేక్షంబు లయియుండు. గాలి చల్లగా వీచెను - వీచెను జల్లగా గాలి - చల్లగా గాలి వీచెను - వీచెను గాలి చల్లగా - గాలి వీచెను చల్లగా - చల్లగా వీచెను గాలి.
21. ఒకానొకచో నొక విభక్తికి మఱియొక విభక్తియు నగు.
మైత్రుండు గృహమున వెడలెను - గృహమునుండి యని యర్థము. వాఁడు వాహనమును దిగెను - వాహనమునుండి యని యర్థము. వారు సుఖమున్నారు - సుఖముతో నని యర్థము. ఇత్యాదులెఱుంగునది.
22. జడంబు తృతీయా సప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు.
రాముఁడు వాలినొక్క కోలంగూలనేసె - కోలతో నని యర్థము. లంకం గలకలంబు పుట్టె - లంకయందని యర్థము. బాహుళకంబుచే నిక్కార్యం బుదంతంబునకు బహుత్వమందెయగు. అర్జునుండు శత్రుసేనలను బాణంబులను రూపుమాపె - బాణములచే నని యర్థము. మీనంబు జలంబులనుండు - జలంబులందని యర్థము. 23. ఉదంత జడంబు తృతీయకు నవర్ణకం బగు.
రాముఁ డొక్క బాణంబున వాలింగూలనేసె - బాణముచే నని యర్థము.