మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

63 బాలవ్యాకరణం|సమాస పరిచ్ఛేదము|కర్మధారయలో అనుప్రయుక్తాలు| Samasa Parichedam | Anuprayuktalu                  


8.సర్వశబ్దంబులు సంబంధమునందుం దచ్ఛబ్దంబుతోడ సమసించు.
నావాఁడు - నాయది - ఇంటివాఁడు - ఇంటిది - రామునివాఁడు - రామునిది.
9.ధాతుజ విశేషణంబులకు విభక్తి వివక్షించునపుడు తచ్ఛబ్దం బనుప్రయుక్తంబగు.
వచ్చినవాఁడు - వచ్చినది - రానివాఁడు - రానియది.
10.ఎల్ల యెడల ధాతుజ విశేషణంబుల కట్టి యను పదంబు విభాష ననుప్రయుక్తం బగు.
వచ్చినట్టి రాముఁడు - వచ్చిన రాముఁడు - వచ్చునట్టి వాఁడు - వచ్చువాఁడు.
11.యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాష నగు.
నీదు కరుణ - నీ కరుణ, నాదు నేరిమి - నా నేరిమి, తనదు రూపు - తనరూపు.
12.గుణవచనంబు లగు నల్లాదులకుం గర్మధారయంబునందు నిగాగంబు బహుళంబుగా నగు.
నల్లని గుఱ్ఱము - నల్ల గుఱ్ఱము.

నల్ల - తెల్ల - పచ్చ - యెఱ్ఱ - చామ - తియ్య - కమ్మ - పుల్ల - విన్న - తిన్న - అల్ల ఇత్యాదులు నల్లాదులు.

62 బాలవ్యాకరణం|సమాస పరిచ్ఛేదము|ఆచ్ఛిక సమాసాల్లో | Balavyakaranam| Samasaparichedam | Achika samasalu

          
                   


4.ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాఁబడు.
5.కర్మధారయంబు త్రిక స్త్రీ సమముగంత ధాతుజ విశేషణపూర్వపదం బయి యుండు.
ఆ చందము - ఈ చందము - ఏ బృందము - వాఁడిమాట - పోఁడిపాట - బెడిదపుటడిదము - మడిసెడుదడములు.

ఈ నియమముచేఁ బల్లిదుఁడు మల్లుఁడు - కావాలుఁడు వారణుఁడు ఇత్యాదుల సమాసంబు లేదు.
6.స్త్రీ సమఘటితంబ యొకానొకండు బహువ్రీహి చూపట్టెడు.
ముక్కంటి - వేగంటి - చలివెలుఁగు - వేవెలుఁగు - మోటబరి ఇత్యాదులు వ్యవహార సిద్ధంబులు గ్రాహ్యంబులు.
7.ఆచ్ఛికశబ్దంబుతోడ స్త్రీ సమంబు ప్రాయికంబుగా ద్వంద్వం బగు.
అన్నదమ్ములు - తల్లిదండ్రులు - ఊరుపల్లెలు - ఆలుమగలు. మగఁడును బిడ్డలును - పల్లమును గళ్ళెమును ఇత్యాదులు సమసింపవని యీ నియమంబున నెఱుంగునది.

61 బాలవ్యాకరణం | సమాస పరిచ్ఛేదము | సమాసాలు | Balavyakaranamu | Samasa Parichedamu | Samasalu

  


                   


2.సాంస్కృతికాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు.
సాంస్కృతికంబని యాచ్ఛికంబని మిశ్రంబని సమాసంబు త్రివిధంబు.
అందు సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు.

కేవల సంస్కృత శబ్దంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు.
రాజాజ్ఞ - తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు.

సంస్కృత సమంబుల సమాసంబు సాధ్యంబు నాఁబడు.
రాజునాజ్ఞ - తటాకంబు నుదకము - లక్ష్మీవల్లభుఁడు.

తక్కిన తెనుఁగుల సమాసం బాచ్ఛికం బనంబడు.
ఱేని యానతి - చెఱువు నీరు - సిరి చెలువుఁడు.

ఉభయంబు గూడినది మిశ్రమంబనంబడు.
రాజు ముదల - చెరువునుదకము - సిరివల్లభుఁడు. 

3.తత్పురుషాదులకు లక్షణంబు ప్రాయికంబుగ సంస్కృతోక్తంబ యగు.
తత్పురుష బాహువ్రీహి ద్వంద్వంబునని సమాసంబులెల్లం ద్రివిధంబులయి యుండు.
అవి ప్రాయికంబుగా నుత్తరాన్యోభయపదార్థ ప్రధానంబు లయియుండు. అందుఁ దత్పురుషంబు వ్యధికరణంబని సమానాధికరణంబని ద్వివిధంబు.

ద్వితీయాదులకు మీఁది పదఁబుతోడ సమాసంబు వ్యధికరణంబు నాఁబడు.
నెలతాల్పు - నెల తక్కువవాఁడు - దేవరమేలు - దొంగభయము - రాముని బాణము - మాటనేర్పరి.

విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబు నాఁబడు.
ఇదియె కర్మధారయంబు నాఁబడు.
సరసపు వచనము - తెల్ల గుఱ్ఱము - మంచిరాజు.

ఇది సంఖ్యాపూర్వంబు ద్విగువునాఁబడు.
ముజ్జగములు - ముల్లోకములు.

బాహువ్రీహి
ముక్కంటి - చలివెలుఁగు.

ద్వంద్వము
తల్లిదండ్రులు - అన్నదమ్ములు.

ప్రాయికంబుగా ననుటచే సంస్కృత లక్షణంబుఁ దొడరని సమాసంబుం గలదని సూచింపంబడియె. దానంజేసి చిగురుఁగేలు - జుంటిమోవి ఇత్యాదులయిన యుపమాన పూర్వపద కర్మధారయంబులు గ్రాహ్యంబులు.

ముఖపద్మము - చరణకమలములు.
ఇట్టి యుపమానోత్తర పదంబులు గలవుగాని విపరీతంబులు సిద్ధంబులు లేవని యెఱుంగునది.

సిద్ధంబు సర్వంబు గ్రాహ్యంబు.
రాజపురుషుఁడు - నీలోత్పలము - పీతాంబరుఁడు - రామలక్ష్మణులు.

కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు.
దానంజేసి యనేకమాఱు లల్పదండిత్యాదులు దుష్టములని తెలియునది.

60 బాల వ్యాకరణం |సమాస పరిచ్ఛేదము |సమాస లక్షణము | Balavyakaranamu |Samasa...
                       

1.సమర్థంబులగు పదంబు లేకపదం బగుట సమాసంబు.
ప్రథగ్భూతంబులగు నర్థంబుల కేకార్థీభావంబు సమర్థ్యంబు.
పృథక్ప్రసిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము.

59 బాలవ్యాకరణం | సమాస పరిచ్ఛేదము| పరిచయము| Bala vyakaranamu| Samasa Parichedam | Parichayam

                     

58 బాల వ్యాకరణము । కారక పరిచ్ఛేదం । యుష్మత్ – అస్మత్ శబ్దాల్లో | Karakaparichedam | Yushmad Asmad Shabdallo                            

33. ప్రథమాంతంబు లగు యుష్మ దస్మ ద్విశేషణంబుల కేకత్వంబున

వు ను లు ను బహుత్వంబున రు ము లు నంతాగమంబులు ప్రాయికంబుగ నగు.

34. ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబున కత్వం బగు.

నీవు ధన్యుఁడవు - నేను ధన్యుఁడను - మీరు ధన్యులరు - మేము ధన్యులము. ఇకారంబు మీఁది కు-ను-వు క్రియా విభక్తుల యుత్వంబున కిత్వంబగు నను సూత్రముచేత వు ను ల కిత్వంబగు. నీవు సుకృతివి - నేను సుకృతిని - ఆర్తి హరుఁడ వౌ నినుఁ గొల్తు నంబుజాక్ష గర్వ గర్విష్ఠుండను నన్ను - మీరలు పెద్దలు - ఇత్యాదులు ప్రాయిక గ్రహణముచే రక్షితంబులయ్యె.

35. అది శబ్దంబునకు వు ను లు పరంబు లగునపుడును సంబోధనంబు నందును దాన యను నాదేశం బగు.

నీవు చిన్నదానవు - నేను జిన్నదాన - ఓ చిన్నదాన.

36. అన్య యుష్మ దస్మ త్కార్యంబులం దుత్తరోత్తరంబు బలీయంబు.

వారును మీరును ధన్యులరు - మీరును మేమును ధన్యులము.

37. ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వపదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపం జను.

పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపదగును. ఏని ప్రభృతి శబ్దములు కొన్ని నియమ సాపేక్షంబు లయియుండు. గాలి చల్లగా వీచెను - వీచెను జల్లగా గాలి - చల్లగా గాలి వీచెను - వీచెను గాలి చల్లగా - గాలి వీచెను చల్లగా - చల్లగా వీచెను గాలి.


57 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం అనుప్రయుక్తాలు Balavyakaranamu Karaka parichedam Anuprayuktalu

       

                       29. భవత్యర్థకంబు సన్నిహిత విశేషణంబునకును, దాని ముందు విశేషణంబుల కయి పదంబును బహుళంబుగా ననుప్రయుక్తం బగు.

అనుసరించువారు