8. | సర్వశబ్దంబులు సంబంధమునందుం దచ్ఛబ్దంబుతోడ సమసించు.నావాఁడు - నాయది - ఇంటివాఁడు - ఇంటిది - రామునివాఁడు - రామునిది. |
|
9. | ధాతుజ విశేషణంబులకు విభక్తి వివక్షించునపుడు తచ్ఛబ్దం బనుప్రయుక్తంబగు.వచ్చినవాఁడు - వచ్చినది - రానివాఁడు - రానియది. |
|
10. | ఎల్ల యెడల ధాతుజ విశేషణంబుల కట్టి యను పదంబు విభాష ననుప్రయుక్తం బగు.వచ్చినట్టి రాముఁడు - వచ్చిన రాముఁడు - వచ్చునట్టి వాఁడు - వచ్చువాఁడు. |
|
11. | యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాష నగు.నీదు కరుణ - నీ కరుణ, నాదు నేరిమి - నా నేరిమి, తనదు రూపు - తనరూపు. |
|
12. | గుణవచనంబు లగు నల్లాదులకుం గర్మధారయంబునందు నిగాగంబు బహుళంబుగా నగు.నల్లని గుఱ్ఱము - నల్ల గుఱ్ఱము.
నల్ల - తెల్ల - పచ్చ - యెఱ్ఱ - చామ - తియ్య - కమ్మ - పుల్ల - విన్న - తిన్న - అల్ల ఇత్యాదులు నల్లాదులు. |
|
|
0 వ్యాఖ్యలు:
Post a Comment