13. | ద్విరుక్తం బగు హల్లు పరంబగునపు డాచ్ఛికం బగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. |
14. | త్రికంబుమీఁది యసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.అక్కన్య - ఆ కన్య, ఇక్కాలము - ఈ కాలము, ఎల్లోకము - ఏ లోకము, అయ్యశ్వము - ఆ యశ్వము.
బహుళకముచే నూష్మరేఫంబు లగు ద్విత్వంబు గలుగదు. ఆ రూపము - ఏ శబ్దము - ఏ షండము - ఆ సుకృతి - ఆ హయము. |
|
15. | కృత హ్రస్వంబగు త్రికంబు మీఁది చోటు శబ్దంబు నోత్వంబున కత్వ హ్రస్వంబులు విభాషనగు.అచ్చోటు - అచ్చటు - అచ్చొటు, ఇచ్చోటు - ఇచ్చటు - ఇచ్చొటు, ఎచ్చోటు - ఎచ్చటు - ఎచ్చొటు.
వీని ద్విత్వంబునకు వక్ష్యమాణవిధిచేఁ బాక్షికంబుగ లోపంబగు. అచటు - అచొటు - ఇచటు - ఇచొటు - ఎచటు - ఎచొటు - ముచ్చొటులు - ముచ్చటులు - ముచ్చొటులు అను రూపంబగు ప్రయోగంబులం గానంబడియెడి. |
|
16. | ఉత్తరపదం బగు చోట శబ్దముటాక్షరమునకు లోపంబు విభాష నగు.చోటు శబ్దం బౌపవిభక్తికంబు గావున దాని యంతిమాక్షరంబు సప్తమ్యాదేశమయిన యకారంబుతోడం బాక్షికంబుగ లోపించునని యర్థము. అచ్చోనున్నాఁడు - అచ్చోట నున్నాఁడు, ఒకచో నుండె - ఒకచోట నుండె. |
|
|
0 వ్యాఖ్యలు:
Post a Comment