మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

21 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం నుగాగమ ప్రాతాది సంధులు Bala vyakaranam- Sandhi Parichedam - Nugagama Pratadi Sandhulu





33. ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు.

చేయు ... అతఁడు ... చేయునతఁడు

చేసెడు ... అతఁడు ... చేసెడునతఁడు

34. షష్ఠీసమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమం బగు.

విధాతృయొక్క ... ఆనతి ... విధాతృనానతి

రాజుయొక్క ... ఆజ్ఞ ... రాజునాజ్ఞ

35. ఉదంత స్త్రీసమంబులకును, బుంపులగు నదంతగుణవాచకంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు.

సొగసు ... తనము ... సొగసుందనము, సొగసుఁదనము, సొగసున్దనము

సరసపు ... తనము ... సరసపుందనము, సరసపుఁదనము, సరసపున్దనము తెల్ల ... తనము ... తెల్లందనము, తెల్లఁదనము, తెల్లన్దనము

36. సమాసంబునఁ బ్రాఁతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగా నగు.

ప్రాఁత ... ఇల్లు ... ప్రాయిల్లు, ప్రాఁతయిల్లు

లేఁత ... దూడ ... లేదూడ, లేఁతదూడ

పూవు ... రెమ్మ ... పూరెమ్మ, పూవురెమ్మ

37. లుప్త శేషంబుకుం బరుషములు పరములగునపుడు నుగాగమం బగు.

ప్రాఁత ... కెంపు ... ప్రాఁగెంపు

లేఁత ... కొమ్మ ... లేఁగొమ్మ

పూపు ... తోఁట ... పూఁదోఁట

మీఁదు ... కడ ... మీఁగడ

కెంపు ... తామర ... కెందామర

చెన్ను ... తోవ ... చెందోవ

చెన్ను శబ్దము వృత్తిని శోణార్థకంబు. బహుళ గ్రహణముచే మీఁదు ప్రభృతులం నిట లోపంబు నిత్యంబు. వ్యవస్థిత విభాషచే నీ ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు. 38. క్రొత్తశబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్ని యెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు.

క్రొత్త ... చాయ ... క్రొంజాయ

క్రొత్త ... చెమట ... క్రొంజెమట

క్రొత్త ... పసిఁడి ... క్రొంబసిఁడి

క్రొత్త ... కారు ... క్రొక్కారు

క్రొత్త ... తావి ... క్రొత్తావి

పరుషేతరంబులు పరంబులగునపుడు నుగాగము ప్రాప్తి లేమిఁ జేసి వానికి ద్విత్వంబగు.

క్రొత్త ... గండి ... క్రొగ్గండి

క్రొత్త ... నన ... క్రొన్నన

క్రొత్త ... మావి ... క్రొమ్మావి

కెంధూళి కెంజడలని ప్రయోగంబులు కానంబడియెడి. బహుళ గ్రహణముచేతఁ గ్రొత్తకుండ లిత్యాదుల లోపంబులేదు. క్రీఁగడుపు, క్రీఁగాలు, క్రీఁదొడ ఇత్యాదులం గ్రిందుశబ్దమునకు లుప్తశేషంబునకు దీర్ఘంబు బహుళ గ్రహణముచేత నని యెఱుఁగునది.

39. అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి. ఒకానొక శబ్దంబున నొకానొక శబ్దము పరంబగునపుడు తొంటియటు లోపనుగాగమంబును, గొండొక శబ్దమున కొకానొక శబ్దము పరంబగునపుడు లోపద్విత్వంబులును ప్రయోగంబులందుఁ జూపట్టెడునని తాత్పర్యము.

పది ... తొమ్మిది ... పందొమ్మిది

తొమ్మిది ... పది ... తొంబది

వంక ... చెఱఁగు ... వంజెఱఁగు

సగము ... కోరు ... సంగోరు

నిండు ... వెఱ ... నివ్వెఱ

నిండు ... వెఱఁగు ... నివ్వెఱఁగు

నెఱ ... తఱి ... నెత్తఱి

నెఱ ... నడుము ... నెన్నడుము

నెఱ ... మది ... నెమ్మది

నెఱ ... వడి ... నెవ్వడి

ఇత్యాదులు ప్రయోగంబుల వలనం దెలియునది.


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు