మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

16 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం గసడదవాదేశ సంధి Bala vyakaranam - Gasadadavadesa Sandhi
13. ప్రథమమీఁది పరుషములకు గ స డ ద వ లు బహుళముగా నగు.

వాఁడు ... కొట్టె ... వాఁడు గొట్టె, వాఁడు కొట్టె

అపుడు ... చనియె ... అపుడు సనియె, అపుడు చనియె

నీవు ... టక్కరివి ... నీవు డక్కరివి, నీవు టక్కరివి

మీరు ... తలఁడు ... మీరు దలఁడు, మీరు తలఁడు

వారు ... పోరు ... వారు వోరు, వారు పోరు

అపు డిప్పు డెప్పు డను శబ్దములు నిత్యైక వచనాంతములు. వాగనుశాసనులు యదాతదా యని గ్రహించుట ప్రపంచార్థ మని యెఱుఁగునది. ఈ కార్యము కళలగు క్రియా పదముల మీఁద సహితము కానంబడియెడి.

రారు ... కదా ... రారు గదా, రారు కదా

వత్తురు ... పోదురు ... వత్తురు వోదురు, వత్తురు పోరుదు

14. తెనుఁగుల మీఁది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు.

వాఁడు ... కంసారి ... వాఁడు కంసారి

వీఁడు ... చక్రపాణి ... వీఁడు చక్రపాణి

ఆయది ... టంకృతి ... ఆయది టంకృతి

అది ... తథ్యము ... అది తథ్యము

ఇది + పథ్యము = ఇది పథ్యము

15. ద్వంద్వంబునం బదంబు పయి పరుషములకు గ స డ ద వ లగు.

కూర ... కాయ ... కూరగాయలు

కాలు ... చేయి ... కాలుసేతులు

టక్కు ... టెక్కు ... టక్కు డెక్కులు

తల్లి ... తండ్రి ... తల్లిదండ్రులు

ఊరు ... పల్లె ... ఊరువల్లెలు
0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు