40. ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదులం దొలి యచ్చు మీఁది వర్ణంబుకెల్ల నదంతం బగు ద్విరుక్త టకారం బగు. ఈ సూత్రమునకు భృశార్థంబునందు ద్విరుక్తంబు విషయంబని యెఱుంగునది.
కడ ... కడ ... కట్టకడ
ఎదురు ... ఎదురు ... ఎట్టఎదురు కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యాదులు కడాదులు.
41. ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తిలోపంబు బహుళంబుగా నగు.
అప్పటికిన్. ... అప్పటికిన్ ... అప్పటప్పటికిన్, అప్పటికప్పటికిన్
అక్కడన్ ... అక్కడన్ ... అక్కడక్కడన్, అక్కడనక్కడన్
ఇంటన్ ... ఇంటన్ ... ఇంటింటన్, ఇంటనింటన్
ఊరన్ ... ఊరన్ ... ఊరూరన్, ఊరనూరన్
ఇంచుక నాఁ డిత్యాదులందు బహుళగ్రహణముచేత నంతిమాక్షర లోపంబు నగు.
ఇంచుక ... ఇంచుక ... ఇంచించుక. ఇంచుకించుక
నాఁడు ... నాఁడు ... నానాఁడు, నాఁడునాఁడు
42. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.
అందదుకు, ఇఱ్ఱింకులు, ఇల్లిగ్గులు, చెల్లచెదరు, చెల్లాచెదరు, తుత్తుమురు, తుత్తునియలు, మిఱుమిట్లు ఇత్యాదులెఱుంగునది.
43. చేత తోడ వలనల కిత్వంబు సమాసంబులం దగు.
నీచేతన్ ... ప్రోపు ... నీచేతిప్రోపు
నాతోడన్ ... చెలిమి ... నాతోడిచెలిమి
నీవలనన్ ... భయము ... నీవలనిభయము
44. అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు.
నాయందున్ ... కరుణ ... నాయందలి కరుణ
ఇందున్ ... జనులు ... ఇందలిజనులు
ఎందున్ ... వారు ... ఎందలివారు
ఎందు శబ్దమున కలిగాగమము కొందఱు లేదండ్రు.
0 వ్యాఖ్యలు:
Post a Comment