5. ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
ఏమి - మఱి - కిషష్టి - అది - అవి - ఇది - ఇవి - ఏది - ఏవి. ఇది యాకృతి గణంబు.
ఏమి ... అంటివి ... ఏమంటివి, ఏమియంటివి.
మఱి ... ఏమి ... మఱేమి, మఱియేమి.
హరికిన్ ... ఇచ్చె ... హరికిచ్చె, హరికినిచ్చె. 6. క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
వచ్చిరి ... అప్పుడు ... వచ్చిరప్పుడు, వచ్చిరియప్పుడు.
వచ్చితిమి ... ఇప్పుడు ... వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు.
7. మధ్యమపురుష క్రియలయం దిత్తునకు సంధి యగును.
ఏలితివి ... అపుడు ... ఏలితివపుడు.
ఏలితి ... ఇపుడు ... ఏలితిపుడు.
ఏలితిరి ... ఇపుడు ... ఏలితిరిపుడు.
8. క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.
వచ్చి ... ఇచ్చెను ... వచ్చియిచ్చెను.
0 వ్యాఖ్యలు:
Post a Comment