మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

15 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం ఆమ్రేడిత ద్విరుక్త టకార సంధి Balavyakarana- Sandhi Paricheda - Amredita - Dvirukta Takara sandhi




                      

9. ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు. ప్రథమేతర విభక్తివిధి నిరవకాశంబుగావున దీనిని బాధించెడిని.


వచ్చున్‌ ... ఇపుడు ... వచ్చునిపుడు

చూడన్‌ ... అయితి ... చూడనయితి.

ఉండెడిన్‌ ... అతఁడు ... ఉండెడినతఁడు.

ఇఁక - ఇఁగ - ఎట్టకేలకు - ఎట్టకేని - ఈయవి - యికాదులని యెఱుంగునది; వీనికి సంధి వైకల్పికము. 10. అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు.

ద్విరుక్తము యొక్క పరరూప మామ్రేడిత మనంబడు. తఱచుగ ననుటచేత నొకానొకచోట వైకల్పిక సంధియుం గలదని తాత్పర్యము.

ఔర ... ఔర ... ఔరౌర.

ఆహా ... ఆహా ... అహాహా.

ఎట్టూ ... ఎట్టూ ... ఎట్టెట్టూ.

ఓహో ... ఓహో ... ఓహోహో.

ఏమి ... ఏమి ... ఏమేమి, ఏమియేమి.

ఎగి యేగి యనుచోఁ గ్త్వార్థంబగుట సంధిలేదు.

11. అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు.

మూర ... ఎఁడు ... మూరెఁడు

వీసె ... ఎఁడు ... వీసెఁడు

అర్థ ... ఇంచు ... అర్థించు

నిర్జి ... ఇంచు ... నిర్జించు

అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది. రాములందు - రాములయందు - హరియందు - ఎనిమిదవది - ఎనిమిదియవది. 12. కుఱు చిఱు కడు నడు నిడు శబ్దముల ఱ డ ల కచ్చు పరంబగునపుడు ద్విరుక్తటకారం బగు.

కుఱు ... ఉసురు ... కుట్టుసురు

చిఱు ... ఎలుక ... చిట్టెలుక

కడు ... ఎదురు ... కట్టెదురు

నడు ... ఇల్లు ... నట్టిల్లు

నిడు ... ఊరుపు ... నిట్టూరుపు


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు