మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Showing posts with label సంధిపరిచ్ఛేదం. Show all posts
Showing posts with label సంధిపరిచ్ఛేదం. Show all posts

23 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం వర్ణలోప అనుకరణ సంధులు Balavyakaranam Varnalopa - Anukarana Sandhulu





45. అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు.

నా ... అది ... నాది, నాయది

నా ... అవి ... నావి, నాయవి

ఉదంతములగు తద్ధర్మ విశేషణంబులకు మీఁద లోపంబు లేదనియు నిదంతంబులగు తద్ధర్మ విశేషంబులకు మీఁద నిత్యంబనియు బహుళగ్రహణముచే నెఱుంగునది.

వచ్చునది - వచ్చునని, వచ్చెడిది - వచ్చెడివి. 46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందువులు విభాష నగు.

భయము ... పడె ... భయపడె, భయంపడె, భయముపడెను

సూత్రము ... పట్టె ... సూత్రపట్టె, సూత్రంపట్టె, సూత్రముపట్టె

ఈ కార్యము కర్తృవాచి మువర్ణకమునకుఁ గలగదు. గజము పడియె, అశ్వము పడియె.

47. మధ్యమపురుష మువర్ణకంబునకు హలవసానంబులు పరంబులగునపుడు లోపము విభాష నగు.

చూడుము ... నన్ను ... చూడునన్ను, చూడుము నన్ను

ఇటు ... చూడుము ... ఇటుచూడు, ఇటు చూడుము

చూడుమనియె, వినుమనియె. ఇచ్చట నచ్చు పరంబయినది. కాబట్టి లోపములేదు.

48. వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాష నగు. నమ్మకము ... ఇట ... నమ్మకిట, నమ్మకు మిట

49. ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుఙ్ఙు లోపంబు విభాష నగు.

ఉండుము ... ఉండుము. ... ఉండుండుము ,ఉండుముండుము

కొట్టుఁడు ... కొట్టుఁడు. ... కొట్టు కొట్టుఁడు, కొట్టుఁడు కొట్టుఁడు

50. విసర్గంబున కనుకరణంబున లోపం బగు.

వర్ధతాం శ్రీః ... అనియె ... వర్ధయాం శ్రీ యనియె.

51. అనుకృతిని నమశ్శబ్దము తుది యత్తున కోత్వము విభాష నగు.

తుభ్యంనమః ... అనె ... తుభ్యంనమో అనె, తుభ్యం నమ యనె

ఈ కార్యము లాఁతిచో సహితము గనంబడియెడి. గతాను గతికో లోకో యటంచున్‌.

52. అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు.

కింతత్‌ ...అనియె ... కింతత్తనియె

కస్త్వమ్‌ ... అనియె ... కస్త్వమ్మనియె 53. అనుకరణంబునం దహమాదుల మకారంబునకు ద్విరుక్తి విభాషనగు.

దాసోహమ్‌ ... అనె ... దాసోహమ్మనె, దాసోహమనె

తత్కర్తవ్యమ్‌ ... అనె ...తత్కర్తవ్యమ్మనె, తత్కర్తవ్యమనె

54. ఉదంతనామంబున కనుకరణంబునందు వుగాగమం బగు.

ఇయంధేనుః ... అనె ... ఇయంధేనువనె

అనుకృతిని నిడుదకుం గుఱుచ యగునని యొకండు పలికెనది నిరాకరంబు. దుర్బలస్య బలం రాజా యన వినవే.

55. వాక్యావసానంబున సంధిలేమి దోషంబు కాదని యార్యు లండ్రు.

సత్యము సర్వశ్రేయము - అదిలేనిచో సర్వధర్మములు వ్యర్థములు. ఇట్లు సంధి విరహంబు కావ్యంబులం బాదాంతమంద చూపట్టెడు.

ఇది సంధి పరిచ్ఛేదము

22 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం ఆమ్రేడిత సంధి విభక్త్యాగమాలు - Amredita Sandhi - Vibhakti Agamalu





40. ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదులం దొలి యచ్చు మీఁది వర్ణంబుకెల్ల నదంతం బగు ద్విరుక్త టకారం బగు. ఈ సూత్రమునకు భృశార్థంబునందు ద్విరుక్తంబు విషయంబని యెఱుంగునది.

కడ ... కడ ... కట్టకడ

ఎదురు ... ఎదురు ... ఎట్టఎదురు కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యాదులు కడాదులు.

41. ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తిలోపంబు బహుళంబుగా నగు.

అప్పటికిన్‌. ... అప్పటికిన్‌ ... అప్పటప్పటికిన్‌, అప్పటికప్పటికిన్‌

అక్కడన్‌ ... అక్కడన్‌ ... అక్కడక్కడన్‌, అక్కడనక్కడన్‌

ఇంటన్‌ ... ఇంటన్‌ ... ఇంటింటన్‌, ఇంటనింటన్‌

ఊరన్‌ ... ఊరన్‌ ... ఊరూరన్‌, ఊరనూరన్‌

ఇంచుక నాఁ డిత్యాదులందు బహుళగ్రహణముచేత నంతిమాక్షర లోపంబు నగు.

ఇంచుక ... ఇంచుక ... ఇంచించుక. ఇంచుకించుక

నాఁడు ... నాఁడు ... నానాఁడు, నాఁడునాఁడు

42. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.

అందదుకు, ఇఱ్ఱింకులు, ఇల్లిగ్గులు, చెల్లచెదరు, చెల్లాచెదరు, తుత్తుమురు, తుత్తునియలు, మిఱుమిట్లు ఇత్యాదులెఱుంగునది.

43. చేత తోడ వలనల కిత్వంబు సమాసంబులం దగు.

నీచేతన్‌ ... ప్రోపు ... నీచేతిప్రోపు

నాతోడన్‌ ... చెలిమి ... నాతోడిచెలిమి

నీవలనన్‌ ... భయము ... నీవలనిభయము

44. అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు.

నాయందున్‌ ... కరుణ ... నాయందలి కరుణ

ఇందున్‌ ... జనులు ... ఇందలిజనులు

ఎందున్‌ ... వారు ... ఎందలివారు

ఎందు శబ్దమున కలిగాగమము కొందఱు లేదండ్రు.


21 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం నుగాగమ ప్రాతాది సంధులు Bala vyakaranam- Sandhi Parichedam - Nugagama Pratadi Sandhulu





33. ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు.

చేయు ... అతఁడు ... చేయునతఁడు

చేసెడు ... అతఁడు ... చేసెడునతఁడు

34. షష్ఠీసమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమం బగు.

విధాతృయొక్క ... ఆనతి ... విధాతృనానతి

రాజుయొక్క ... ఆజ్ఞ ... రాజునాజ్ఞ

35. ఉదంత స్త్రీసమంబులకును, బుంపులగు నదంతగుణవాచకంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు.

సొగసు ... తనము ... సొగసుందనము, సొగసుఁదనము, సొగసున్దనము

సరసపు ... తనము ... సరసపుందనము, సరసపుఁదనము, సరసపున్దనము తెల్ల ... తనము ... తెల్లందనము, తెల్లఁదనము, తెల్లన్దనము

36. సమాసంబునఁ బ్రాఁతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగా నగు.

ప్రాఁత ... ఇల్లు ... ప్రాయిల్లు, ప్రాఁతయిల్లు

లేఁత ... దూడ ... లేదూడ, లేఁతదూడ

పూవు ... రెమ్మ ... పూరెమ్మ, పూవురెమ్మ

37. లుప్త శేషంబుకుం బరుషములు పరములగునపుడు నుగాగమం బగు.

ప్రాఁత ... కెంపు ... ప్రాఁగెంపు

లేఁత ... కొమ్మ ... లేఁగొమ్మ

పూపు ... తోఁట ... పూఁదోఁట

మీఁదు ... కడ ... మీఁగడ

కెంపు ... తామర ... కెందామర

చెన్ను ... తోవ ... చెందోవ

చెన్ను శబ్దము వృత్తిని శోణార్థకంబు. బహుళ గ్రహణముచే మీఁదు ప్రభృతులం నిట లోపంబు నిత్యంబు. వ్యవస్థిత విభాషచే నీ ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు. 38. క్రొత్తశబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్ని యెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు.

క్రొత్త ... చాయ ... క్రొంజాయ

క్రొత్త ... చెమట ... క్రొంజెమట

క్రొత్త ... పసిఁడి ... క్రొంబసిఁడి

క్రొత్త ... కారు ... క్రొక్కారు

క్రొత్త ... తావి ... క్రొత్తావి

పరుషేతరంబులు పరంబులగునపుడు నుగాగము ప్రాప్తి లేమిఁ జేసి వానికి ద్విత్వంబగు.

క్రొత్త ... గండి ... క్రొగ్గండి

క్రొత్త ... నన ... క్రొన్నన

క్రొత్త ... మావి ... క్రొమ్మావి

కెంధూళి కెంజడలని ప్రయోగంబులు కానంబడియెడి. బహుళ గ్రహణముచేతఁ గ్రొత్తకుండ లిత్యాదుల లోపంబులేదు. క్రీఁగడుపు, క్రీఁగాలు, క్రీఁదొడ ఇత్యాదులం గ్రిందుశబ్దమునకు లుప్తశేషంబునకు దీర్ఘంబు బహుళ గ్రహణముచేత నని యెఱుఁగునది.

39. అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి. ఒకానొక శబ్దంబున నొకానొక శబ్దము పరంబగునపుడు తొంటియటు లోపనుగాగమంబును, గొండొక శబ్దమున కొకానొక శబ్దము పరంబగునపుడు లోపద్విత్వంబులును ప్రయోగంబులందుఁ జూపట్టెడునని తాత్పర్యము.

పది ... తొమ్మిది ... పందొమ్మిది

తొమ్మిది ... పది ... తొంబది

వంక ... చెఱఁగు ... వంజెఱఁగు

సగము ... కోరు ... సంగోరు

నిండు ... వెఱ ... నివ్వెఱ

నిండు ... వెఱఁగు ... నివ్వెఱఁగు

నెఱ ... తఱి ... నెత్తఱి

నెఱ ... నడుము ... నెన్నడుము

నెఱ ... మది ... నెమ్మది

నెఱ ... వడి ... నెవ్వడి

ఇత్యాదులు ప్రయోగంబుల వలనం దెలియునది.


20 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం కర్మధారయ సమాస సంధులు Bala vyakaranam - Karmadharaya Samasa Sandhulu




                               

28. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమం బగు.

కఱకు ... అమ్ము ... కఱకుటమ్ము

నిగ్గు ... అద్దము ... నిగ్గుటద్దము

సరసపు ... అలుక ... సరసపుటలుక

29. కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.

పేరు ... ఉరము ... పేరటురము, పేరురము చిగురు ... ఆకు ... చిగురుటాకు, చిగురాకు

పొదరు ... ఇల్లు ... పొదరుటిల్లు, పొదరిల్లు

30. పేదాది శబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమం బగు.

పేద ... ఆలు ... పేదరాలు

బీద ... ఆలు ... బీదరాలు

పేద - బీద - ముద్ద - బాలింత - కొమ్మ - జవ - అయిదవ - మనుమ - గొడ్డు ఇట్టివి పేదాదులు. ఇందు జవ్వని శబ్దంబునకు జవాదేశంబని యెఱుంగునది. "ఏకాంతమునందు నున్న జవరాండ్ర" నని ప్రయోగము.

31. కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపు డత్వంబున కుత్వంబును రుగాగమంబు నగు.

ధీర ... ఆలు ... ధీరురాలు

గుణవంత ... ఆలు ... గుణవంతురాలు

ఇచట వృత్తియం దాలుశబ్దము స్త్రీమాత్రపరము.

32. కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపు లగు. సరసము ... మాట ... సరసపుమాట, సరసంపుమాట

విరసము ... వచనము ... విరసపువచనము, విరసంపువచనము


19 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం నుగాగమం Bala vyakaranam - sandhi parichedam - Nugagama Sandhi



                                      

25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఇచటం బరుషంబులు పరంబులగునపుడు ద్రుతంబునకు బిందు సంశ్లేషంబులచే మూఁడురూపంబులు. సరళంబులు పరంబులగునపుడు లోప సంశ్లేష పూర్ణబిందువులచేత మూఁడు రూపములు. విధాన సామర్థ్యము వలన దీనికి లోపము లేదు. వక్ష్యమాణవిధిచే స్వత్వములేదు.

చిగురు ... కయిదువు ... చిగురుంగయిదువు, చిగురుఁగయిదువు, చిగురున్గయిదువు

తళుకు ... గజ్జెలు ... తళుకుంగజ్జెలు, తళుకుగజ్జెలు, తళుకున్గజ్జెలు

సింగపు ... కొదమ ... సింగపుంగొదమ, సింగపుఁగొదమ, సింగపున్గొదమ

ఉన్నతంపు ... గొడుగు ... ఉన్నతంపుంగొడుగు, ఉన్నతంపుగొడుగు, ఉన్నతంపున్గొడుగు నలుఁగడాదులు నీ యాగమంబు లేదండ్రు. ఈ యాగమంబొకా నొకచోట స్థిరంబు పరంబగుచోఁ గానంబడియెడి. గఱునపున్మురువు.

26. సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు.

27. తలఁబ్రాలు మొదలగు సమాసంబుల ద్రుతమునకు లోపము లేదు.

తలఁబ్రాలు - ఒడిఁబ్రాలు - సేసఁబ్రాలు - ఊరఁబంది - ఊరఁబిచ్చిక - తోడఁబుట్టువు - తోఁబుట్టువు - ఒల్లన్‌బాటు - ఒడఁబాటు ఇత్యాదులు.


18 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం ద్రుతం వైవిధ్యం Balavyakaranam- Sandhi Parichedam - Dritam vaividhyam




20. అవసానంబునందు ద్రుతస్వరంబునకేని ద్రుతంబున కేని లోపంబు బహుళంబుగా నగు.

వాఁడువచ్చెన్‌ - వాఁడువచ్చె - వాఁడువచ్చెను. ఈలోపంబు పద్యాంతములయందు గణానుసారంబుగ వ్యవస్థితంబయియుండు గుర్వవసాయియగు పద్యంబుతుదను స్వత్వంబులేదు. అతిశయముగ బుద్ధిమంతుఁడగు బుధసేవన్‌.

21. కొన్నియెడల ద్రుతంబుమీఁద నకారంబు గానంబడియెడి.

అదియునున్గాక, దివంబునుంబోలె.

22. అఁట యిఁక చుఁడు శబ్దంబులం దప్ప నుడి తొలి హ్రస్వంబుమీఁద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు.

ముంగొంగు, క్రొంబసిఁడి, కన్దోయి.

23. తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు.

తాను ... ౘదివె ... తాఁ ౙదివె, తాను ౙదివె

తాను ... వినె ... తా వినె, తాను వినె

దీర్ఘంబు మీఁదిది గాన దీనికి నెఱసున్న లేదు.

24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు.

ఎల్లయర్థములు, ఎల్లకలుషములు. సర్వపర్యాయంబయిన యెల్ల శబ్దంబు ద్రుతాంతంబయిన యవ్యయంబు. దీని కసమాసంబున విశేష్యంబునకు ముందు ప్రయోగంబు లేదు.


17 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం ద్రుతం పై హల్లులు Bala vyakaranam - Sandhi Parichedam-Dritam pai Hallulu




16. ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళములగు. పూచెను ... కలువలు ... పూచెను గలువలు

తోఁచెను ... చుక్కలు ... తోఁచెను జుక్కలు

చేసెను ... టక్కులు ... చేసెను డక్కులు

నెగడెను ... తమములు ... నెగడెను దమములు

మొగిడెను ... పద్మము ... మొగిడెను బద్మము

17. ఆదేశసరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాష నగు.

సంశ్లేషం బనగా మీఁది హల్లుతోఁ గూడికొనుట.

పూచెను గలువలు .... పూచెంగలువలు, పూచెఁగలువలు, పూచెన్గలువలు

తోఁచెను జుక్కలు .... తోఁచెంజుక్కలు, తోఁచెఁజుక్కలు, తోఁచెన్జుక్కలు

చేసెను డక్కులు .... చేసెండక్కులు, చేసెఁడక్కులు, చేసెన్డక్కులు

నెగడెను దమములు ... నెగడెందమములు, నెగడెఁదమములు, నెగడెన్దమములు

మొగిడెను బద్మము ... మొగిడెంబద్మము, మొగిడెఁబద్మము, మొగిడెన్బద్మము పక్షంబున స్వత్వంబగు. స్వత్వంబనఁగా ద్రుతంబునకుఁ బ్రకృతి భావము.

18. ద్రుతంబునకు సరళస్థిరంబులు పరంబు లగునపుడు లోపసంశ్లేషంబులు విభాష నగు.

వచ్చెను ... గోవులు ... వచ్చె గోవులు, వచ్చెన్గోవులు, వచ్చెను గోవులు

మెఱసెను ... ఖడ్గము ... మెఱసెఖడ్గము, మెఱసెన్ఖడ్గము, మెఱసెను ఖడ్గము

19. వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి.

వచ్చెను ... ధాత్రీపతి ... వచ్చెంధాత్రీపతి

పాడెను ... గంధర్వుఁడు ... పాడెంగంధర్వుఁడు

కన్‌ ... దోయి ... కందోయి

అనుసరించువారు