25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.
ఇచటం బరుషంబులు పరంబులగునపుడు ద్రుతంబునకు బిందు సంశ్లేషంబులచే మూఁడురూపంబులు. సరళంబులు పరంబులగునపుడు లోప సంశ్లేష పూర్ణబిందువులచేత మూఁడు రూపములు. విధాన సామర్థ్యము వలన దీనికి లోపము లేదు. వక్ష్యమాణవిధిచే స్వత్వములేదు.
చిగురు ... కయిదువు ... చిగురుంగయిదువు, చిగురుఁగయిదువు, చిగురున్గయిదువు
తళుకు ... గజ్జెలు ... తళుకుంగజ్జెలు, తళుకుగజ్జెలు, తళుకున్గజ్జెలు
సింగపు ... కొదమ ... సింగపుంగొదమ, సింగపుఁగొదమ, సింగపున్గొదమ
ఉన్నతంపు ... గొడుగు ... ఉన్నతంపుంగొడుగు, ఉన్నతంపుగొడుగు, ఉన్నతంపున్గొడుగు నలుఁగడాదులు నీ యాగమంబు లేదండ్రు. ఈ యాగమంబొకా నొకచోట స్థిరంబు పరంబగుచోఁ గానంబడియెడి. గఱునపున్మురువు.
26. సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు.
27. తలఁబ్రాలు మొదలగు సమాసంబుల ద్రుతమునకు లోపము లేదు.
తలఁబ్రాలు - ఒడిఁబ్రాలు - సేసఁబ్రాలు - ఊరఁబంది - ఊరఁబిచ్చిక - తోడఁబుట్టువు - తోఁబుట్టువు - ఒల్లన్‌బాటు - ఒడఁబాటు ఇత్యాదులు.
0 వ్యాఖ్యలు:
Post a Comment