మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

23 బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదం వర్ణలోప అనుకరణ సంధులు Balavyakaranam Varnalopa - Anukarana Sandhulu

45. అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు.

నా ... అది ... నాది, నాయది

నా ... అవి ... నావి, నాయవి

ఉదంతములగు తద్ధర్మ విశేషణంబులకు మీఁద లోపంబు లేదనియు నిదంతంబులగు తద్ధర్మ విశేషంబులకు మీఁద నిత్యంబనియు బహుళగ్రహణముచే నెఱుంగునది.

వచ్చునది - వచ్చునని, వచ్చెడిది - వచ్చెడివి. 46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందువులు విభాష నగు.

భయము ... పడె ... భయపడె, భయంపడె, భయముపడెను

సూత్రము ... పట్టె ... సూత్రపట్టె, సూత్రంపట్టె, సూత్రముపట్టె

ఈ కార్యము కర్తృవాచి మువర్ణకమునకుఁ గలగదు. గజము పడియె, అశ్వము పడియె.

47. మధ్యమపురుష మువర్ణకంబునకు హలవసానంబులు పరంబులగునపుడు లోపము విభాష నగు.

చూడుము ... నన్ను ... చూడునన్ను, చూడుము నన్ను

ఇటు ... చూడుము ... ఇటుచూడు, ఇటు చూడుము

చూడుమనియె, వినుమనియె. ఇచ్చట నచ్చు పరంబయినది. కాబట్టి లోపములేదు.

48. వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాష నగు. నమ్మకము ... ఇట ... నమ్మకిట, నమ్మకు మిట

49. ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుఙ్ఙు లోపంబు విభాష నగు.

ఉండుము ... ఉండుము. ... ఉండుండుము ,ఉండుముండుము

కొట్టుఁడు ... కొట్టుఁడు. ... కొట్టు కొట్టుఁడు, కొట్టుఁడు కొట్టుఁడు

50. విసర్గంబున కనుకరణంబున లోపం బగు.

వర్ధతాం శ్రీః ... అనియె ... వర్ధయాం శ్రీ యనియె.

51. అనుకృతిని నమశ్శబ్దము తుది యత్తున కోత్వము విభాష నగు.

తుభ్యంనమః ... అనె ... తుభ్యంనమో అనె, తుభ్యం నమ యనె

ఈ కార్యము లాఁతిచో సహితము గనంబడియెడి. గతాను గతికో లోకో యటంచున్‌.

52. అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు.

కింతత్‌ ...అనియె ... కింతత్తనియె

కస్త్వమ్‌ ... అనియె ... కస్త్వమ్మనియె 53. అనుకరణంబునం దహమాదుల మకారంబునకు ద్విరుక్తి విభాషనగు.

దాసోహమ్‌ ... అనె ... దాసోహమ్మనె, దాసోహమనె

తత్కర్తవ్యమ్‌ ... అనె ...తత్కర్తవ్యమ్మనె, తత్కర్తవ్యమనె

54. ఉదంతనామంబున కనుకరణంబునందు వుగాగమం బగు.

ఇయంధేనుః ... అనె ... ఇయంధేనువనె

అనుకృతిని నిడుదకుం గుఱుచ యగునని యొకండు పలికెనది నిరాకరంబు. దుర్బలస్య బలం రాజా యన వినవే.

55. వాక్యావసానంబున సంధిలేమి దోషంబు కాదని యార్యు లండ్రు.

సత్యము సర్వశ్రేయము - అదిలేనిచో సర్వధర్మములు వ్యర్థములు. ఇట్లు సంధి విరహంబు కావ్యంబులం బాదాంతమంద చూపట్టెడు.

ఇది సంధి పరిచ్ఛేదము

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు