అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - పెక్కు - పలు - ఆ - ఈ - నీ - నా - మన - తా సంఖ్యావాచకములు అన్ని ప్రభృతులు. |
వీనికిం బ్రథమాంతరూపంబు లుదాహరించెద. వీనిలో డుమంతంబులకెల్ల న్యాగమంబు పూర్వోక్తంబును స్మరించునది. బహువచన లకారంబునకు రాదేశంబును, బూర్వాగమంబును బ్రథమా బహువచనంబునకుం బోలె నెఱుంగునది. |
విశేషాకారంబులు గలిగెనేనిఁ గొండొకచో ద్వితీయవఱకును గొండొకచోఁ దృతీయయం దొక్క రూపంబు వఱకును రూపభేదంబులు వక్కాణించెద. శేషంబూహించునది. |
అన్ని మొదలగు శబ్దంబులాఱును, ద్విప్రభృతి సంఖ్యావాచకంబులును మహదర్థంబులు బహువచనాంతంబులగు - అమహదర్థంబు లేకవచనాంతంబులగు. |
ఇందు నీ మొదలగు నాలుగు శబ్దంబులు - సర్వార్థంబులం దుల్యరూపంబు లయియుండును. |
మ - అనునది మహదర్థమనుటకు, అ - అనునది యమహదర్థమనుటకు, ప్ర - మొదలగునవి ప్రథమాది విభక్తులకును సంకేతములుగా నిందు గ్రహించునది. |
సర్వతావదర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | అందఱు అందొఱు | - | అన్ని | - |
ఇయదర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | ఇందఱు | - | ఇన్ని | - |
కియద్యావదర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | ఎందఱు | - | ఎన్ని | - |
కతిపయార్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | కొందఱు | - | కొన్ని | - |
బహ్వర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | పెక్కుండ్రు పెక్కురు | - | పెక్కు | పెక్కులు |
|
ఈ శబ్దంబు లౌపవిభక్తికంబు లగుటంజేసి అన్నిటి - అన్నింటి, ఇన్నిటి - ఇన్నింటి, ఎన్నిటి - ఎన్నింటి, కొన్నిటి - కొన్నింటి, పెక్కిటి -పెక్కింటి యను రూపంబులు ద్వితీయాద్యేక వచనంబులు పరంబు లగునపు డమహత్త్వంబునం దగునని తెలియునది. |
బహ్వర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | పలుగురు పలుగుండ్రు | - | అమహత్త్వంబున దీనికి వ్యస్త ప్రయోగంబు లేదు. |
తదర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | వాఁడు | వారు వారలు వాండ్రు | అది అద్ది ఆయది అయ్యది | అవి అవ్వి ఆయవి అయ్యవి | ద్వితీయ | వానిని | వారిని వారలను వాండ్రను | దానిని ఆదానిని అద్దానిని | వానిని |
ఇదమర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | వీఁడు | వీరు వీరలు వీఁడ్రు | ఇది ఇవి ఈయది ఇయ్యది | ఇవి ఇవ్వి ఈయవి ఇయ్యవి | ద్వితీయ | వీనిని | వీరిని వీరలను వీండ్రను | దీనిని ఈ దానిని ఇద్దానిని | వీనిని |
యత్కిమర్థకము: | | మహదర్థము | అమహదర్థము | | ఏక వచనము | బహు వచనము | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | ఏఁడు ఏవాఁడు ఎవ్వాఁడు ఎవ్వఁడు ఎవఁడు | ఏరు ఏవారు, ఏవారలు, ఏవాండ్రు ఎవ్వారు, ఎవ్వారలు, అవ్వాండ్రు ఎవ్వరు, ఎవ్వండ్రు ఎవరు, ఎవండ్రు | ఎది ఏది ఎద్ది ఏయది ఎయ్యది | ఎవి ఏవి ఎవ్వి ఏయవి ఎయ్యవి | ద్వితీయ | ఏనిని ఏవానిని ఎవ్వారిని ఎవ్వనిని ఎవనిని | ఏరిని ఏవారిని, ఏవారలను, ఏవాండ్రను ఎవ్వారిని, ఎవ్వారలను, ఎవ్వాండ్రను ఎవ్వరిని, ఎవ్వండ్రను ఎవరిని, ఎవండ్రను | దేనిని ఏదానిని ఎదానిని | వేనిని ఏవానిని ఎవ్వానిని |
|
మహతి వాచ్యంబగునే నేకత్వంబున మత్కిమర్థక శబ్దంబు ఎవ్వరిత - ఎవ్వర్త - ఎవ్వత - ఎవరిత - ఎవర్త - ఎవత - ఎవ్వరితి - ఎవ్వర్తి - ఎవ్వతి - ఎవరితి - ఎవర్తి - ఎవతి - ఎవ్వరితె - ఎవ్వర్తె - ఎవ్వతె - ఎవరితె - ఎవర్తె - ఎవతె - ఎవ్వతుక - ఎవర్తుక - ఎవర్తుక అని యిరువది రెండు రూపంబులు వడయు. |
తదాదులు మూఁడు మహద్వాచకంబు లేకత్వంబునం బూజ వివక్షించునపుడు అతఁడు - ఆతఁడు, ఇతఁడు - ఈతఁడు, ఎతఁడు - ఏతఁడు అను రూపంబులు వడయు. |
మహతీవాచకంబులు ఆమె - ఆపె - ఆకె, ఈమె -ఏపె - ఏకె, ఏమె - ఏపె - ఏకె అను రూపంబులు వడయు. |
యుష్మదర్థకము: | | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | నీవు ఈవు | మీరు, మీరలు ఈరు, ఈరలు | ద్వితీయ | నిన్నును | మిమ్మును | తృతీయ | నీ చేతను | మీ చేతను |
అస్మదర్థకము: | | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | నేను ఏను | మేము, నేము ఏము | ద్వితీయ | నన్నును | మమ్మును | తృతీయ | నాచేతను | మాచేతను |
ఉభయార్థకము: | | ఏక వచనము | బహు వచనము (నిత్యబహువచనాంతము) | ప్రథమ | - | మనము | ద్వితీయ | - | మనలను | తృతీయ | - | మనచేతను, మనలచేతను |
ఆత్మార్థకము: | | ఏక వచనము | బహు వచనము | ప్రథమ | తన్ను | తన్ను | ద్వితీయ | తన్నును | తమ్మును | తృతీయ | తనచేతను | తమచేతను |
|
3 వ్యాఖ్యలు:
telugu patla mee krushiki dhanyavadalu sir
meeru ilaanti yenno upayogapade vishayalapai marinni videos cheyalani korukuntunna
dhanyavaadalu sir
ధన్యవాదాలు 🙏
Dhanyavaadamulu
Post a Comment