మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

45 బాల వ్యాకరణం ఆచ్ఛిక పరిచ్ఛేదం సర్వనామములు Achika parichedam Sarvanamalu

                             




                        
కింది సూత్రాలపై పాఠాన్ని చూడండి. (ఆంధ్రభారతి సౌజన్యంతో)
 
24.అన్ని ప్రభృతులు సర్వనామంబులు.
అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - పెక్కు - పలు - ఆ - ఈ - నీ - నా - మన - తా సంఖ్యావాచకములు అన్ని ప్రభృతులు.
వీనికిం బ్రథమాంతరూపంబు లుదాహరించెద. వీనిలో డుమంతంబులకెల్ల న్యాగమంబు పూర్వోక్తంబును స్మరించునది. బహువచన లకారంబునకు రాదేశంబును, బూర్వాగమంబును బ్రథమా బహువచనంబునకుం బోలె నెఱుంగునది.
విశేషాకారంబులు గలిగెనేనిఁ గొండొకచో ద్వితీయవఱకును గొండొకచోఁ దృతీయయం దొక్క రూపంబు వఱకును రూపభేదంబులు వక్కాణించెద. శేషంబూహించునది.
అన్ని మొదలగు శబ్దంబులాఱును, ద్విప్రభృతి సంఖ్యావాచకంబులును మహదర్థంబులు బహువచనాంతంబులగు - అమహదర్థంబు లేకవచనాంతంబులగు.
ఇందు నీ మొదలగు నాలుగు శబ్దంబులు - సర్వార్థంబులం దుల్యరూపంబు లయియుండును.
మ - అనునది మహదర్థమనుటకు, అ - అనునది యమహదర్థమనుటకు, ప్ర - మొదలగునవి ప్రథమాది విభక్తులకును సంకేతములుగా నిందు గ్రహించునది.
సర్వతావదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఅందఱు
అందొఱు
-అన్ని-
ఇయదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఇందఱు-ఇన్ని-
కియద్యావదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఎందఱు-ఎన్ని-
కతిపయార్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమకొందఱు-కొన్ని-
బహ్వర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమపెక్కుండ్రు
పెక్కురు
-పెక్కుపెక్కులు
ఈ శబ్దంబు లౌపవిభక్తికంబు లగుటంజేసి అన్నిటి - అన్నింటి, ఇన్నిటి - ఇన్నింటి, ఎన్నిటి - ఎన్నింటి, కొన్నిటి - కొన్నింటి, పెక్కిటి -పెక్కింటి యను రూపంబులు ద్వితీయాద్యేక వచనంబులు పరంబు లగునపు డమహత్త్వంబునం దగునని తెలియునది.
బహ్వర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమపలుగురు
పలుగుండ్రు
-అమహత్త్వంబున దీనికి వ్యస్త ప్రయోగంబు లేదు.
తదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమవాఁడువారు
వారలు
వాండ్రు
అది
అద్ది
ఆయది
అయ్యది
అవి
అవ్వి
ఆయవి
అయ్యవి
ద్వితీయవానినివారిని
వారలను
వాండ్రను
దానిని
ఆదానిని
అద్దానిని
వానిని
ఇదమర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమవీఁడువీరు
వీరలు
వీఁడ్రు
ఇది
ఇవి
ఈయది
ఇయ్యది
ఇవి
ఇవ్వి
ఈయవి
ఇయ్యవి
ద్వితీయవీనినివీరిని
వీరలను
వీండ్రను
దీనిని
ఈ దానిని
ఇద్దానిని
వీనిని
యత్కిమర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఏఁడు
ఏవాఁడు
ఎవ్వాఁడు
ఎవ్వఁడు
ఎవఁడు
ఏరు
ఏవారు, ఏవారలు, ఏవాండ్రు
ఎవ్వారు, ఎవ్వారలు, అవ్వాండ్రు
ఎవ్వరు, ఎవ్వండ్రు
ఎవరు, ఎవండ్రు
ఎది
ఏది
ఎద్ది
ఏయది
ఎయ్యది
ఎవి
ఏవి
ఎవ్వి
ఏయవి
ఎయ్యవి
ద్వితీయఏనిని
ఏవానిని
ఎవ్వారిని
ఎవ్వనిని
ఎవనిని
ఏరిని
ఏవారిని, ఏవారలను, ఏవాండ్రను
ఎవ్వారిని, ఎవ్వారలను, ఎవ్వాండ్రను
ఎవ్వరిని, ఎవ్వండ్రను
ఎవరిని, ఎవండ్రను
దేనిని
ఏదానిని
ఎదానిని
వేనిని
ఏవానిని
ఎవ్వానిని
మహతి వాచ్యంబగునే నేకత్వంబున మత్కిమర్థక శబ్దంబు ఎవ్వరిత - ఎవ్వర్త - ఎవ్వత - ఎవరిత - ఎవర్త - ఎవత - ఎవ్వరితి - ఎవ్వర్తి - ఎవ్వతి - ఎవరితి - ఎవర్తి - ఎవతి - ఎవ్వరితె - ఎవ్వర్తె - ఎవ్వతె - ఎవరితె - ఎవర్తె - ఎవతె - ఎవ్వతుక - ఎవర్తుక - ఎవర్తుక అని యిరువది రెండు రూపంబులు వడయు.
తదాదులు మూఁడు మహద్వాచకంబు లేకత్వంబునం బూజ వివక్షించునపుడు అతఁడు - ఆతఁడు, ఇతఁడు - ఈతఁడు, ఎతఁడు - ఏతఁడు అను రూపంబులు వడయు.
మహతీవాచకంబులు ఆమె - ఆపె - ఆకె, ఈమె -ఏపె - ఏకె, ఏమె - ఏపె - ఏకె అను రూపంబులు వడయు.
యుష్మదర్థకము:
 ఏక వచనముబహు వచనము
ప్రథమనీవు
ఈవు
మీరు, మీరలు
ఈరు, ఈరలు
ద్వితీయనిన్నునుమిమ్మును
తృతీయనీ చేతనుమీ చేతను
అస్మదర్థకము:
 ఏక వచనముబహు వచనము
ప్రథమనేను
ఏను
మేము, నేము
ఏము
ద్వితీయనన్నునుమమ్మును
తృతీయనాచేతనుమాచేతను
ఉభయార్థకము:
 ఏక వచనముబహు వచనము
(నిత్యబహువచనాంతము)
ప్రథమ-మనము
ద్వితీయ-మనలను
తృతీయ-మనచేతను, మనలచేతను
ఆత్మార్థకము:
 ఏక వచనముబహు వచనము
ప్రథమతన్నుతన్ను
ద్వితీయతన్నునుతమ్మును
తృతీయతనచేతనుతమచేతను
25.సంఖ్యకుం బూరణార్థంబునం దవగాగమం బగు.
రెండవవాఁడు - రెండవది, మూడఁవవాఁడు - మూఁడవది.
26.సర్వనామక్రియాపదంబుల బహువచనంబు మహత్తునకుం బోలె మహతికగు.
వారిద్దఱు రుక్మిణీ సత్యభామలు, వీరు మువ్వురు శ్రీభూనీళలు.

3 వ్యాఖ్యలు:

Anonymous said...

telugu patla mee krushiki dhanyavadalu sir
meeru ilaanti yenno upayogapade vishayalapai marinni videos cheyalani korukuntunna
dhanyavaadalu sir

Dr.R.P.Sharma said...

ధన్యవాదాలు 🙏

DrKodiRama said...

Dhanyavaadamulu

Post a Comment

అనుసరించువారు