మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

41 బాల వ్యాకరణం ఆచ్ఛిక పరిచ్ఛేదం ఏకవచన రూపాలు Achika Parichedam Ekavac...


1. సంస్కృతసమేతరంబయిన యీభాష యచ్చ యనంబడు.

స్పష్టము

2. ఆచ్ఛికశబ్దంబులెల్లం దఱుచుగ స్త్రీసమంబులుం గ్లీబసమంబులు నయి యుండు.

స్త్రీ సమత్వాతిదేశంబుచేఁ ప్రథమైక వచన లోపాదికంబును, గ్లీబ సమత్వాది దేశంబుచే మువర్ణకంబు నగునని యెఱుంగునది. అన్న - మిన్న - అద్ద - గద్ద - జాణ - గాణ - ఓడ - గోడ ఇత్యాదులు స్త్రీసమంబులు. బియ్యము - నెయ్యము - అల్లము - మొల్లము - సున్నము - సన్నము ఇత్యాదులు క్లీబసమంబులు. తఱచుగ ననుటచేఁ బుంలింగతుల్యంబులుం గొండొక కలవని తాత్పర్యము. కొమరుఁడు - చందురుఁడు - జముఁడు - కందుఁడు ఇత్యాదులు.

3. బల్లిదాదులు సంస్కృత తుల్యంబులు.

మహత్త్వంబున వీని కుత్వడుఙాదులు నమహత్త్వంబున మువర్ణకాదులును, స్త్రీత్వంబునం దాలు శబ్దముతోడ సమాసంబునుం గలుగునని యెఱుంగునది. బల్లిదుఁడు, బల్లిదము, బల్లిదురాలు, బల్లిద, అక్కజ, కావల, బెట్టిద, బెడిద, మిసిమింత, మొక్కల ఇత్యాదులు బల్లిదాదులు.

4. మహత్తు లగు మగాదులకుం గయిరాదులకును డుఙ్ఙగు నుత్వంబు గాదు. మగఁడు - మనుమఁడు - కయిరఁడు - కత్తళఁడు. మగ - మనుమ - రాయ - పాప - వ్రే - ఱే - ఈ - కా ప్రత్యయాంతంబులు ఇత్యాదులు మగాదులు. కయిర - కత్తళ - జన్న - నీల ఇత్యాదులు కయిరాదులు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు