మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

53 బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదం షష్ఠి సప్తమి విభక్తులు Balavyakaranamu Karaka parichedamu Shshti Saptami Vibhaktulu





                    

ఈ క్రింది సూత్రాలకు పాఠం 

             15. శేషషష్ఠికి యొక్కయు నగు.

ఇచట శేషంబనఁగా సంబంధంబు. రాముని యొక్క గుణములు - నా యొక్క మిత్రుఁడు - వానియొక్క తమ్ముఁడు. కువర్ణకంబును గొన్ని యెడల సంబంధంబునం దగు. నాకుం దమ్ముఁడు - మీకు నెచ్చెలి.

16. నిర్ధారణషష్ఠికి లోపల వర్ణకంబగు.

జాతి గుణ క్రియా సంజ్ఞలచేత సముదాయంబునుండి యేకదేశంబునకుం బృథక్కరణంబు నిర్థారణం బనంబడు. ఎద్దానివలన నిర్థారణంబగు నచ్చటి షష్ఠికి లోపల వర్ణకం బగునని యర్థము. మనుష్యులలోపల క్షత్రియుండు శూరుండు - గోవుల లోపలఁ గపిల బహుక్షీర - అధ్వగుల లోపలం బాఱువాఁడు శీఘ్రగామి - ఛాత్రులలోపలఁ మైత్రుండు సమర్థుండు. ఇచట సప్తమియు గలదు. మనుష్యులయందు క్షత్రియుండు శూరుండు. ఇత్యాదులెఱుంగునది.

17. అధికరణంబునకు సప్తమి యగు.

అధికరణంబు నానాధారంబు. ఔపశ్లేషికంబు వైషయికం బభివ్యాపకంబని యాధారంబు త్రివిధంబు. ఘటమందు జలమున్నది - మోక్షమం దిచ్ఛ గలదు - అన్నిటియం దీశ్వరుండు గలడు.

18. ఉకారాంత జడంబునకు నవర్ణకం బగు.

ఘటంబున జలంబున్నది - దేవదత్తునకు మోక్షమున నిచ్ఛ గలదు.


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు